Header Banner

ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ రైలు..! ఆ రూట్‌లోనే..!

  Mon May 19, 2025 09:32        Politics

ఆంధ్రప్రదేశ్ మీదుగా కొత్తగా మరో వందేభారత్ రైలు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ.. అమరావతి ప్రాంతం నుంచి ఈ రైలును నడపాలనే ప్రతిపాదన వచ్చింది. విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లడానికి కనీసం 12 నుంచి 16 గంటల సమయం పడుతోంది. అదే వందే భారత్ రైలు వస్తే ఈ సమయం తగ్గుతుందని.. అమరావతి ప్రాంతానికి కూడా రవాణా సౌకర్యం పెరుగుతుంది అంటున్నారు. ఈ రైలు ఏర్పాటు చేస్తే విజయవాడ వైపు నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు, వివిధ వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు.

ఇప్పటికే కాచిగూడ-యశ్వంత్‌పూర్, గుల్బర్గా-బెంగళూరు వయా అనంతపురం మీదుగా రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. వీటికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చింది.. ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో ఉన్న విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్ రైలును నడపాలంటున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా రెండు రూట్లు తెరపైకి వచ్చాయి.
కొత్తగా ప్రతిపాదిస్తున్న ఈ విజయవాడ–బెంగళూరు రైలును వయా అనంతపురం మీదుగా నడపాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ రైలు విజయవాడ, గుంటూరు, పల్నాడు, నంద్యాల, డోన్, గుంతకల్లు, అనంతపురం, హిందూపురం, యలహంక మీదగా నడపాలనే ప్రతిపాదన ఉందంట. అనంతపురం మీదుగా వెళితే అమరావతికి కూడా కనెక్టివిటీ పెరుగుతుందని భావిస్తున్నారట.

తాజాగా మరో ప్రతిపాదన తెరపైకి వచ్చిందట.. విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట, కృష్ణరాజపురం మీదుగా బెంగళూరు వెళ్లేలా ప్లాన్ చేయాలని కొందరు కోరుతున్నారు. వారంలో ఆరు రోజుల పాటూ 8 కోచ్‌ల (సీసీ-7, ఈసీ-1)తో ప్లాన్ చేయాలంటున్నారు. ఈ రూట్‌లో వందేభారత్ నడిపినా ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తుందంటున్నారు. గతంలో ఏపీకి చెందిన ఎంపీలు ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించారు. మరి ఈ కొత్త వందేభారత్ అంశంపై రైల్వే అధికారులు ఈ రిక్వెస్ట్‌పై ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #VandeBharat #AndhraPradesh #IndianRailways #NewTrain #TrainUpdates #VandeBharatExpress #RailwayNews